పులుల గణనపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

పులుల గణనపై శిక్షణ

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

చుంచుపల్లి: ఆల్‌ ఇండియా పులుల గణన–2026 మూడో దశ నిర్వహించేందుకు అటవీ సిబ్బందికి సోమవారం కొత్తగూడెం వనవిహార్‌లో శిక్షణ నిర్వహించారు. మణుగూరు, కిన్నెరసాని వన్యప్రాణి నిర్వహణ, సత్తుపల్లి అటవీ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అమ్రాబాద్‌ పులుల అభయారణ్య క్యూరేటర్‌ రవికాంత్‌ శిక్షణ ఇచ్చారు. పులులు, ఇతర వన్యప్రాణుల ఉనికిని గుర్తించే విధానం, ఆధారాల నమోదు, సమాచార సేకరణ, పరిశీలన, రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించారు. పాదముద్రలు, విసర్జన ఆనవాళ్లు, గోళ్ల గుర్తులు, ఆహార అవశేషాలు, జంతువుల సంచారా నికి సంబంధించిన ఇతర ఆధారాలను శాసీ్త్రయంగా గుర్తించి నమోదు చేయాలని సూచించారు. కిన్నెరసాని వన్యప్రాణి నిర్వహణ విభాగం అటవీ అధికా రి బాబును గణనకు సమన్వయ అధికారిగా నియమించారు. శాసీ్త్రయంగా సేకరించిన క్షేత్రస్థాయి సమాచారం భవిష్యత్‌ వన్యప్రాణుల సంరక్షణ, ఆవాసాల నిర్వహణకు కీలక ఆధారంగా నిలుస్తుందని జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌ తెలిపారు. అధికారులు బాబు, ఉపేంద్ర, స్నేహలత, సత్తార్‌ అలీ, కిరణ్‌కుమార్‌, కనకమ్మ, గీతామాధురి, జ్యోత్స్నాదేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement