సమస్యలు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

భద్రాచలం: నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన గిరిజ నుల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, పోడు పట్టాలు, బోర్లు, విద్యుత్‌, మోటార్లు, స్వయం ఉపాధి, పింఛన్లు, గృహాలు, రహదారులు, ఉపాధి, వైద్య సహాయం తదితర అంశాలపై పెద్ద సంఖ్యలో అర్జీలు అందాయి. అనంతరం పీఓ మాట్లాడుతూ ప్రతి అర్జీ పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు డేవిడ్‌ రాజ్‌, చందన, ఆనంద్‌ కుమార్‌, అరుణకుమారి, మధుకర్‌, సైదులు, వేణు, గన్యా పాల్గొన్నారు.

మెరిట్‌ జాబితా సిద్ధం

ఖమ్మం రీజియన్‌ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్‌టైమ్‌ ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించి తాత్కాలిక మెరిట్‌ జాబితాలను సిద్ధం చేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఆధారాలతో అభ్యంతరాలను సమర్పించాలని సూచించారు. ఈ నెల 6వ తేదీలోగా ఐటీడీఏలోని ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం (గురుకులం)లో అందించాలని తెలిపారు.

భద్రాచలం ఆస్పత్రికి వెద్య పరికరాలు..

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఐటీడీఏ నిధులతో రూ.15 లక్షల విలువైన వైద్య పరికరాలను సమకూర్చారు. సోమవారం ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ వీటిని ఆస్పత్రికి అందజేశారు. కంటి పరీక్షా పరికరం, బ్లడ్‌ టెస్టింగ్‌ మిషన్‌, ఈసీజీ మిషన్‌తో పాటు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ట్రేలు, ఆక్సిజన్‌్‌ సిలిండర్లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, పీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రుల్లో సేవల మెరుగుకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజశేఖర్‌రెడ్డి, ఏడీఎంహెచ్‌ఓ సైదులు, ఆర్‌ఎంఓ డాక్టర్‌ మల్లేష్‌, డాక్టర్‌ జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement