మనమే టాప్‌ | - | Sakshi
Sakshi News home page

మనమే టాప్‌

Oct 4 2026 9:43 AM | Updated on Oct 4 2026 9:43 AM

తెలంగాణలో

నంబర్‌ వన్‌ స్థానంలో జిల్లా

క్రూడ్‌ ఆయిల్‌ తయారీలోనూ

అగ్రస్థానం

జిల్లాలో 80 వేల ఎకరాల్లో

ఆయిల్‌పామ్‌ తోటలు

రాష్ట్రంలోనే మొదటి స్థానం

లాభాలు అందించే

ఏకై క సమాఖ్య

ఆయిల్‌పామ్‌

సాగులో

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలు కొబ్బరి తోటలకు ప్రసిద్ధి గాంచాయి. దీంతో ఉద్యాన పంటల కేటగిరీలోకి వచ్చే ఆయిల్‌పామ్‌ సాగు కూడా తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొదలైంది. అక్కడ వస్తున్న దిగుబడికి తగ్గట్టుగా పెదవేగిలో పామాయిల్‌ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటైంది. సాధారణ పంటల కంటే ఆయిల్‌పామ్‌లో రాబడి ఎక్కువగా ఉండటంతో క్రమంగా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోనూ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అశ్వారావుపేటలో గంటకు 30 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం కలిగిన ఫ్యాక్టరీని నిర్మించారు. క్రమంగా సాగు పెరగడంతో దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో 90 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో మరో ఫ్యాక్టరీ నిర్మించారు. దీంతో మొత్తంగా క్రషింగ్‌ సామర్థ్యం 120 టన్నులకు చేరింది.

క్రూడ్‌ ఆయిల్‌ వచ్చేది ఇలా..

కాపునకు వచ్చిన గెలలను కోసి ఫ్యాక్టరీకి తరలిస్తారు. గెల బరువు 20 కేజీల నుంచి 50 కేజీల వరకు ఉంటుంది. ఫ్యాక్టరీకి వచ్చిన గెలలను ముందుగా స్టెరిలైజేషన్‌ చాంబర్లలో ఉడికిస్తారు. ఆ తర్వాత దశలో గింజలు, గుజ్జు వేర్వేరు అవుతాయి. గుజ్జును ప్రెషర్‌ చాంబర్‌కు పంపడం ద్వారా రా క్రూడ్‌ ఆయిల్‌ వస్తుంది. గింజల నుంచి కెర్నెల్‌ ఆయిల్‌ తయారవుతుంది. క్రూడ్‌ ఆయిల్‌, కెర్నెల్‌ తయారీలో మిగులుగా వచ్చిన పిప్పి (ఫైబర్‌) నుంచి అనేక ఇతర ఉత్పత్తులు తయారవుతున్నాయి. పశువుల దాణాగా ఉపయోగించే కెర్నెల్‌ కేక్‌తో పాటు ఫర్నేస్‌లలో(బయోమాస్‌ విద్యుత్‌ తయారీ ప్లాంట్లు) ఉపయోగించే రా ఫ్యూయల్‌గా పిప్పి ఉపయోగపడుతుంది. ఈ పిప్పిని ప్రధాన ప్యూయల్‌గా చేసుకుని అప్పారావుపేటలో 4.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను సైతం నిర్వహిస్తున్నారు. దీంతో వార్షిక విద్యుత్‌ బిల్లుల్లో 60 శాతం వరకు ఆదా అవుతోంది. ఉప ఉత్పత్తులైన కెర్నెల్‌ ఆయిల్‌, ఫైబర్‌, పామ్‌నట్‌షెల్‌, కెర్నెల్‌ కేక్‌ల ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తోంది.

మార్పు మొదలైంది

పరిస్థితులు అన్ని విధాలుగా సానుకూలంగా ఉంటే ఏడాదికి వరి (ఖరీఫ్‌, రబీ) గరిష్టంగా రూ.40 వేల వరకు ఆదాయం ఉంటే పత్తికి రూ.35 వేల వరకు ఆదాయం వస్తోంది. అదే పామాయిల్‌ విషయానికి ఈ లాభం, ఎంత తక్కువగా లెక్క కట్టినా నాలుగు రెట్లకు పైగా ఉంటోంది. పైగా పామాయిల్‌ విషయంలో తొలి మూడేళ్లు కష్టపడితే ఆ తర్వాత 25 ఏళ్ల వరకు రాబడి పొందే అవకాశం ఉంది. అంతర్‌పంటల ద్వారా అదనపు రాబడి కూడా పొందే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో క్రమంగా పామాయిల్‌ సాగు పెరుగుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా పామాయిల్‌ సాగు విస్తీర్ణం 1.79 లక్షల ఎకరాలు ఉండగా, అందులో 80 వేల ఎకరాల జిల్లాలోనే ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా సాగు విస్తీర్ణాన్ని ఐదు లక్షల ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో లక్షన్నర ఎకరాలు కేవలం జిల్లాలోనే విస్తరించనుంది. దమ్మపేట, అశ్వారావుపేట మండలాలు ఇప్పటికే పామాయిల్‌ సాగుకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారగా, ములకలపల్లి, పాల్వంచ మండలాలు ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకున్నాయి. తర్వాత స్థానాల్లో లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, సుజాతనగర్‌, టేకులపల్లి మండలాలు ఉన్నాయి.

పామాయిల్‌ విత్తనం నుంచి నూనె వరకు ప్రతీ దశలో సమష్టిగా పనులు జరుగుతాయి. దీని కోసం 1991లో పామాయిల్‌ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చారు. ఆ తర్వాత 2000లో పలు సవరణలు చేశారు. ఆ చట్ట ప్రకారం పామాయిల్‌ ఫెడరేషన్‌ ద్వారానే విదేశాల నుంచి మొక్కలను దిగుమతి చేసుకోవడం, సాగు చేయడం, వచ్చిన పంటను ఫ్యాక్టరీలో క్రషింగ్‌ చేయడం, క్రషింగ్‌ సామర్థ్యం, బహిరంగ మార్కెట్‌లో ఆయిల్‌ ధరల ఆధారంగా పామాయిల్‌ గెలలకు మద్దతు ధర నిర్ణయించుకోవడం వంటివి జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని కోపరేటివ్‌ సొసైటీల్లో లాభాల్లో ఉన్న ఏకై క సొసైటీగా పామాయిల్‌ ఫెడరేషన్‌కు గుర్తింపు పొందింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1500 కోట్ల టర్నోవరుపై రూ.220 కోట్ల వరకు నికర లాభాన్ని ఆర్జించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement