సూపర్‌బజార్(కొత్తగూడెం): గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఆన్‌లైన్ మీటింగ్ ద్వారా గోదావరి నదీ తీర జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాచలంలో చేపడుతున్న పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులు, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ, అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత తదితర ఏర్పాట్లపై చేపడుతున్న చర్యలను తెలిపారు. జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సునీత, ఇరిగేషన్ ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ, పంచాయతీరాజ్ ఈఈ సత్యనారాయణ పాల్గొన్నారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శైలజా రామయ్యర్


