ఏడ చూసిన కుక్కలు, కోతుల రాజ్యమే నడుస్తున్నట్లు పరిస్థితులు కన్పిస్తున్నాయి. చివరికి కలెక్టరేట్‌లో సైతం కోతులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కలెక్టరేట్‌లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో డస్ట్‌బిన్‌లలో వేసిన ఆహారం కోసం అవి రాజసంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం కలెక్టరేట్ ఫస్ట్ ఫ్లోర్‌లోని డస్ట్‌బిన్ వద్ద కుక్క వెళ్లి డస్ట్‌బిన్‌లో పడేసిన ఆహార పదార్థాలను చిందరవందరగా పడేసింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విచ్చలవిడిగా తిరుగుతున్నాయని చర్చించుకుంటున్నారు. ఇకనైనా నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. – సూపర్‌బజార్(కొత్తగూడెం)


