సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేపట్టారు. తొలిరోజు బుధవారం కొత్తగూడెం డీఈ కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేసి ధర్నా నిర్వహించారు. 92 మంది సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ కూనురాజు శ్రీనివాస్, కొత్తగూడెం డివిజన్ చైర్మన్ మోతీరామ్, కన్వీనర్ రాంబాబు, కో కన్వీనర్ రాజేందర్ తదితరులు మాట్లాడుతూ ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీసు రూల్స్ వర్తింపజేయాలని కోరారు. పీస్ రేట్ కార్మికులకు జీఓ నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సమ్మెకు సీఐటీయూ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి పులి గణేష్‌బాబు, 327 జిల్లా కార్యదర్శి రాజేష్, ఎస్‌సీ, ఎస్‌టీ అసోసియేషన్ డివిజన్ కార్యదర్శి ధర్మరాజు సంఘీభావం తెలిపారు.


