చర్ల: మండలంలోని పెదమిడిసిలేరు సమీపంలో గల తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టును రాష్ట్ర స్థాయి రక్షణ బృందం సోమవారం సందర్శించింది. ఈసందర్భంగా ప్రాజెక్టు గేట్లు, రబ్బర్ షీల్స్, బేరింగ్‌లు తదితర ముఖ్యమైన పరికరాల పరిస్థితి, డీవాటరింగ్ తదితర విభాగాలను పరిశీలించిన సభ్యులు.. అధిక వర్షాలు కురిసిన సమయంలో ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరితే ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే అంశాన్ని ప్రాజెక్టు అధికారులను అడిగితెలుసుకున్నారు.ఈబృందంలోప్రాజెక్టుల సేఫ్టీటీమ్ చైర్మన్ గంజు అశోక్‌కుమార్, రిటైర్డ్ టీం సభ్యులు సంజీవ్ (మెకానికల్), లక్ష్మణరావు(డిజైన్స్), భవానీ రాంశంకర్, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఏవీవీఎల్ నర్సింహారావు, ఈఈ ఎస్‌ఏ జానీ, తిరుపతి, ఏఈలు సంపత్, ఎం. సుమ, రవితేజ ఉన్నారు.


