కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా

Mar 24 2026 7:54 AM | Updated on Mar 24 2026 7:54 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీకార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారంకలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మా ట్లాడుతూ ఇప్పటికీ మూడుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టినా ఎప్పుడూ ఐసీడీఎస్‌కు నిధులుపెంచలేదని, అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించా రు.అంగన్‌వాడీలకు రూ.18వేలు వేతనంఇస్తామని ఎన్నికలమేనిఫెస్టోలో పెట్టి న కాంగ్రెస్‌.. ఇంతవరకూ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. వీరి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రంఅందజేశారు.కార్యక్రమంలో అంగన్‌వాడీ జిల్లాకార్యదర్శి జి.పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి కె.సత్య, ఈసం వెంకటమ్మ, పాయం రాధాకుమారి, వీరభద్ర,రాజ్యలక్ష్మి, శైలజ,సూరమ్మ,భానుశ్రీ,హేమలత,సావిత్రిపాల్గొన్నారు.

రామన్నగూడెం ఆదివాసీల బిక్షాటన

ఎనిమిదో రోజుకు చేరిన దీక్షలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): భూసమస్య పరిష్కారం కోసం రామన్నగూడెం ఆదివాసీలు కలెక్టరేట్‌ ధర్నాచౌక్‌లో చేపట్టిన ఆత్మగౌరవ నిరవధిక నిరాహార దీక్షలు సోమవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఆహార కొరతతో పిల్లలు, వృద్ధుల కోసం నవభారత్‌ సెంటర్‌లో వారు బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా రామన్నగూడెం సర్పంచ్‌ మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ మహిళలు మడకం స్వరూప, మాడి లక్ష్మి, కొర్స కావేరి, మడకం సత్యవతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement