వాణిజ్య సిలిండర్లు లేక
మూత పడుతున్న హోటళ్లు
27న భద్రాచలంలో
సీతారాముల కల్యాణం
లక్ష మందికి పైగా భక్తులు
వచ్చే అవకాశం
నవమి భక్తుల
లక్ష మందికి పైగా
శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు భద్రాచలం చేరుకుంటారు. ఇందులో ఉమ్మడి ఖమ్మంజిల్లా నుంచి 50వేల మంది వరకు ఉంటే, ఇతరప్రాంతాల నుంచి మరో 50 వేల మంది వస్తారు. ఎక్కువ మంది ఈనెల 26వ తేదీ రాత్రికే భద్రాచలం చేరుకుని, కల్యాణం ముగిసిన తర్వాత 27వ తేదీ సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. అంటే 24 గంటల పాటు కనీసం 50 వేల మంది భక్తులకు భద్రాచలంలో ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇప్పటికే టిఫిన్లు బంద్
ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం ఈనెల 1న మొదలైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇరవై రోజులు గడిచినా ఆంక్షల్లో ఎలాంటి సడలింపు లేదు. దీంతో రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వారి నుంచి బడా హోటళ్ల వరకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గ్యాస్ వినియోగం అధికమయ్యే వంటలు చేయడాన్ని ఇప్పటికే హోటళ్ల నిర్వాహకులు నిలిపేశారు. పూరి, వడ, బోండా వంటివి పూర్తిగా తగ్గిపోయాయి. కొందరు బిర్యానీలు కూడా ఆపేశారు. చైనీస్ ఫాస్ట్ పుడ్ సెంటర్లు కూడా మూతపడుతున్నాయి. లేదా పీక్ అవర్స్‌లో తెరిచి, ఆ తర్వాత మూసేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఫుడ్ సెక్టార్‌లో ఉన్న వారంతా పూర్తి సామర్థ్యం మేరకు ఆహార పదార్థాలు అందించలేకపోతున్నారు. ఈ తరుణంలో ఒకేసారి సుమారు లక్ష మందికి కనీస అవసరాలైన భోజనం, టిఫిన్లు సమకూర్చడం ఇప్పుడు సవాల్‌గా మారింది.
రద్దీ పెరిగే అవకాశం
ఆహార పదార్థాలు ఎక్కువగా లభించే అన్నదాన కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద అధికంగా రద్దీ నెలకొనే అవకాశం ఉంది. నవమి రోజున ఉండే తీవ్రమైన ఎండనేపథ్యంలో ఒకేచోట రద్దీ నెలకొనడం కూడా అంత మంచిది కాదు. నవమి సందర్భంగా ఇలాంటి ఇబ్బందులు తొలగాలంటే కనీసం భద్రాచలంలోని హోటళ్లకై నా వాణిజ్య సిలిండర్లు సరఫరాచేయాలి. వీలుంటే కొత్తగూడెం, పాల్వంచలోని హోటళ్లను కూడా ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
కమర్షియల్ సిలిండర్లు లేకపోవడంతో ఇప్పటికే మా హోటల్‌లో పూరీలు, వడలు చేయడం ఆపేశాం. నవమికి పరిస్థితి ఇలాగే ఉంటే భక్తులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి సిలిండర్లు సరఫరా చేయాలి. –జోగారావు,
చందమామ రెస్టారెంట్ యజమాని, భద్రాచలం
భద్రాచలంలో 400 వరకు కమర్షియల్ సిలిండర్లు ఉన్నాయి. నవమి సందర్భంగా కనీసం మూడు రోజు ల పాటు రోజుకు 400 సిలిండర్ల చొప్పున పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. అనుమతి రాగానే పంపిణీ చేస్తాం.
– ప్రేమ్‌కుమార్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి
నవమికి ముందురోజు చేరుకునే భక్తులు స్థానిక హోటళ్లు, సత్రాలపైనే ఎక్కువగా ఆధారపడతా రు. భద్రాచలంతో పాటు ప్రధానదారిలో ఉన్న కొత్తగూ డెం,పాల్వంచల్లోని హోటళ్లను కూడా విని యోగించుకుంటారు. కానీ, ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా రోడ్డు పక్కన ఉండే హోటళ్ల నుంచి రెస్టారెంట్ల వరకు ఆహారం లభించడం కష్టమనే పరిస్థితి నెలకొంది. మరోవైపు నవమి సందర్భంగా కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు ప్రధాన కూడళ్ల వద్ద స్వచ్ఛంద సంస్థలు, కుల, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో ఆన్నదానం, ఆహార పొట్లాలు పంపిణీ చేస్తుంటారు. ప్రస్తుత సిలిండర్ల సమస్యతో ఈ సేవల్లోనూ కోత పడే అవకాశం ఉంది.
పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధం సెగ శ్రీరామ నవమి పండుగను కూడా
తాకుతోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల
సరఫరా నిలిపేయడంతో ఇప్పటికే హోటళ్లలో ఆహార పదార్థాల తయారీ తగ్గింది. ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి
నవమికి భద్రాచలం వచ్చే భక్తుల ఆహార
అవసరాలు తీర్చడం ఎలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
కొనసాగుతున్న
గ్యాస్ కష్టాలు !


