పెద్దమ్మతల్లికి లక్ష బిల్వార్చన | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి లక్ష బిల్వార్చన

Mar 24 2026 7:54 AM | Updated on Mar 24 2026 7:54 AM

పాల్వంచరూరల్‌: శ్రీదేవీ వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమవారం పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు లక్ష బిల్వ పత్రాలతో అర్చన చేశారు. అనంతరం శ్రీచక్రార్చన, సూర్యనమస్కారాలు, శ్రీ సూక్తి పారాయణం, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం గావించాక చివరన లక్ష కుసుమార్చన నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు సీహెచ్‌.పాపారావు, పెండ్లి రాంరెడ్డి, చందుపట్ల రమ్య పాల్గొన్నారు.

మెరుగైన వైద్యసేవలు

అందించాలి

చుంచుపల్లి: ఈనెల 27న జరిగే శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు అవసరమైన సేవలందించాలని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌ సిబ్బందికి సూచించారు. తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన సూచనలు చేశారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్‌ రవిబాబు, జీజీఎస్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ సత్య చైతన్య, డాక్టర్లు సాయికళ్యాణ్‌, చైతన్య రాకేష్‌, ప్రతాప్‌, పుల్లారెడ్డి, మధువరన్‌, హరీష్‌, మలేరియా ప్రోగ్రాం అధికారి స్పందన, రాందాస్‌ పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలతో ఆర్థికాభివృద్ధి చెందాలి

ఐటీడీఏ పీఓ రాహుల్‌

భద్రాచలం: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని గిరిజనులు ఆర్థికా భివృద్ధి సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ అన్నారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంఽధిత అధికారులకు అందజేశారు. అనంత రం మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులపట్ల ఉద్యోగులు మర్యాదపూర్వకంగా వ్యహరించాలని, వారి సమస్యలు తెలుసుకుని అర్హతల మేరకు పరిష్కరించాలని సూచించారు. నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి పథకాలు ఎన్నో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవా లని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్‌ డేవిడ్‌రాజ్‌, డీడీ అశోక్‌, ఈఈ మధుకర్‌, గురుకుల ఆర్‌సీఓ అరుణకుమారి, ఏఓ సున్నం రాంబాబు, ఆయా శాఖల అధికారులు ఉదయ్‌కుమార్‌, గన్యా,లక్ష్మీనారాయణ, హరిత, హేమంత్‌, నాగేశ్వరరావు,ఆదినారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement