ఆదివాసీల సంక్షేమానికి కృషి
ఇల్లెందురూరల్: ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి పోలీసు శాఖ కృషి చేస్తుందని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. మండలంలోని మర్రిగూడెం పంచాయతీ ఏడుప్పులగూడెంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీలకు కనీస సౌకర్యాల కల్పనలో తమ శాఖ ముందుంటుందని చెప్పారు. మత్తు పదార్థాల వినియోగం, సైబర్ క్రైమ్, పోక్సో కేసులపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాలించాలన్నారు. గ్రామంలోని వాహనాలు ఉన్న 100 మంది యువతకు హెల్మెట్‌లు, దుప్పట్లు, చిన్నారులకు నోట్‌బుక్స్, పెన్నులు అందజేశారు. అనంతరం గ్రామంలో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రభాను, సీఐలు తిరుపతి, తాటిపాముల సురేష్, బత్తుల సత్యనారాయణ, ఎస్సైలు రాజేందర్, రవూఫ్ పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజ్


