గోకులరామంలో రామయ్య ‘విలాసం’
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం విలాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. పగల్ పత్తు, రాపత్తు సేవలు పూర్తయ్యాక స్వామివారికి వివిధ ప్రాంతాల్లో మూడు రోజులు ఈ వేడుకలు నిర్వహిస్తారు. తొలిరోజు శనివారం ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న గోకుల రామంలో నేత్రపర్వంగా జరిపించారు. స్వామివారిని ప్రత్యేక వాహనంలో కొలువుదీర్చి మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ వేడుకగా గోకులరామం వేదికపైకి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజ లు చేసి, హారతి సమర్పించారు. కాగా, భక్తులు దారి పొడవునా స్వామివారికి స్వాగతం పలికారు. భద్రాచలానికి చెందిన హరిశ్చంద్రనాయక్ ఆధ్వర్యంలో జరి గిన ఈ వేడుకల్లో అర్చకులు, వేద పండితులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన..
అంతరాలయంలోని మూలమూర్తులకు మొదట సువర్ణ తులసీ అర్చన జరిపించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వైభవోపేతంగా ప్రారంభమైన
విలాసోత్సవాలు


