ముగిసిన జిల్లాస్థాయి పోటీలు
కొత్తగూడెంఅర్బన్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా)ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని హైస్కూళ్ల విద్యార్థులకు నిర్వహించిన ఎడ్యుకుషన్, ఒలింపియాడ్ జిల్లాస్థాయి పోటీలు శుక్రవారం ముగిశాయి. ఆనందఖని జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగిన పోటీల్లో 6, 7 తరగతులవారిని జూనియర్లు, 8, 9, 10వ తరగతుల విద్యార్థులుగా సీనియర్లుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. తొలుత ప్రశ్న పత్రాలను జిల్లా ఏసీజీఈ ఎస్.మాధవరావు ఆవిష్కరించి మాట్లాడారు. ఆంగ్ల నైపుణ్యాలు, పోటీతత్వం పెంపొందించేందుకు ఎల్టా చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు. మరుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణ విద్యార్థులను గ్లోబల్ విద్యార్థులుగా మార్చేందుకు ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇంగ్లిష్‌లో భావవ్యక్తీకరణ, భాష వ్యాకరణపై పట్టు సాధిస్తే భవిష్యత్‌లో ఎన్నో పోటీ పరీక్షలను ఎదుర్కొనవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్టా జిల్లా అధ్యక్షుడు షేక్ దస్తగిరితోపాటు డాక్టర్ షేక్ మీరాహుస్సేన్, వి.వెంకటేశ్వర్లు, ఎస్.కె జహంగీర్ షరీఫ్, కె.సైదులు, రవికుమార్, భాగ్యశ్రీ, వెంకన్న పాల్గొన్నారు.


