జీయర్ మఠంలో రాపత్తు సేవ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు సేవలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం జీయర్ మఠం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో రాపత్తు సేవ నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని పల్లకీలో కొలువుదీర్చి కోలాటాలు, వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ జీయర్ మఠానికి తీసుకెళ్లారు. వేదికపై ఆశీనులు చేసి, ప్రత్యేక పూజలు చేశాక హారతి సమర్పించారు. అలాగే ఆలయంలో నమ్మాళ్వార్ పరమపదోత్సవం, చిత్రకూట మండపంలో శాత్తుమురై నిర్వహించారు.
వైభవంగా నిత్యకల్యాణం
శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నయనానందకరంగా నిత్య కల్యాణం


