బీజేపీ బూత్ కమిటీల సమన్వయ సమావేశం
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లిలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన గురువారం భారతీయ జనతా పార్టీ బూత్ నిర్మాణ అభియాన్ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ.. పార్టీకి బూత్ కమిటీ పునాది వంటిదని, జిల్లా వ్యాప్తంగా అన్ని బూతులలో పటిష్టమైన కమిటీలను నిర్మించాలన్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ప్రతీ బూతు స్థాయిలో 12 మందితో కూడిన కమిటీ వేసి అనునిత్యం ఓటర్ల సమస్యల పరిష్కా రం కోసం పాటుపడాలన్నారు. బూత్ నిర్మాణ అభియాన్ కన్వీనర్ గొడుగు శ్రీధర్, కో– కన్వీనర్ భోగి కృష్ణ, ఖమ్మం పార్లమెంట్ కో–కన్వీనర్ జల్లారపు శ్రీనివాసరావు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చింతలచెరువు శ్రీనివాస్‌రావు, మండల అధ్యక్షులు, కన్వీనర్లు, కో– కన్వీనర్లు, నాయకులు పాల్గొన్నారు.


