క్రీడోత్సవాలకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

క్రీడోత్సవాలకు వేళాయె..

Jan 9 2026 7:27 AM | Updated on Jan 9 2026 7:27 AM

క్రీడోత్సవాలకు వేళాయె..

క్రీడోత్సవాలకు వేళాయె..

షెడ్యూల్‌ ఇలా..

గ్రామ స్థాయి నుంచి ప్రారంభం

మూడు విభాగాల్లో 44 క్రీడాంశాలు

ఇల్లెందురూరల్‌: గ్రామస్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి తీసుకొచ్చిన సీఎం కప్‌ పోటీలతో పల్లెల్లో క్రీడా సంబురాలు మొదలుకానున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలను నాలుగు దశల్లో ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీవైఎస్‌ఓ మందపాటి పరంధామరెడ్డి షెడ్యూల్‌ విడుదల చేశారు.

గతేడాదికి భిన్నంగా..

గతేడాదికి భిన్నంగా ఈ ఏడాది చిన్నారులు, వృద్ధులు, మహిళలకు సైతం ప్రత్యేక క్రీడలను ఏర్పాటు చేశారు. సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో మొత్తం 44 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనుండగా.. ఆసక్తి గల క్రీడాకారులందరూ పాల్గొనవచ్చని అధికారులు సూచిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్‌, నియోజకవర్గ స్థాయిలో అదనంగా బాస్కెట్‌బాల్‌ పోటీలు ఉంటాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిలో మిగతా అన్ని క్రీడాపోటీలు నిర్వహిస్తారు.

క్రీడాంశాల వివరాలు..

కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌, అథ్లెటిక్స్‌, ఆర్చరీ, టేబుల్‌ టెన్నిస్‌, లాన్‌ టెన్నిస్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌, షూటింగ్‌బాల్‌, సెపత్‌తక్రా, చెస్‌, బేస్‌బాల్‌, నెట్‌బాల్‌, కిక్‌ బాక్సింగ్‌, సైక్లింగ్‌, రాకెట్‌, రోయింగ్‌, స్క్వాష్‌, కన్నోయింగ్‌ కయాకింగ్‌, అత్యాపత్య, సాఫ్ట్‌బాల్‌, పవర్‌లిఫ్టింగ్‌, ఉషూ, సాఫ్ట్‌బాల్‌, తైక్వాండో, బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌, సెయిలింగ్‌, బాల్‌బ్యాడ్మింటన్‌, మల్లఖంబ, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్‌, ఫెన్సింగ్‌, పికల్‌బాల్‌, పారాగేమ్స్‌.

దరఖాస్తు విధానం..

సీఎం కప్‌ పోటీల్లో పాల్గొనదల్చిన క్రీడాకారులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ క్రీడాకారుడు రెండు క్రీడల్లో మాత్రమే పాల్గొనే అవకాశం ఉండడంతో క్రీడాంశాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. క్రీడాకారులు తమ వివరాలను satg. telangana. gov. in అనే వెబ్‌సైట్‌లో వారి ఫోన్‌ నంబర్‌ నమోదు చేసి ఓటీపీ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి లేదా గూగుల్‌ ప్లేస్టోర్‌లో సీఎంకప్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని పాల్గొనదల్చిన క్రీడల్లో నమోదు చేయాలి. వారు మాత్రమే పోటీలలో పాల్గొనేందుకు అర్హులని జిల్లా యువజన, క్రీడాల శాఖ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో సీఎం కప్‌ పోటీలు నిర్వహించనుండగా.. గ్రామస్థాయిలో ఈ నెల 17వ తేదీ నుంచి 22 వరకు, మండల, మున్సిపల్‌ స్థాయిలో ఈ నెల 28 నుంచి 31 వరకు, నియోజకవర్గస్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, జిల్లాస్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు, రాష్ట్రస్థాయిలో ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. సీఎం కప్‌ పోటీలకు జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్‌ కన్వీనర్‌గా, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లుగా ఎంఈఓలు, డీఈఓ,డీపీఓలు వ్యవహరిస్తారు.

ఈ నెల 17 నుంచిసీఎం కప్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement