సర్వే పనుల అడ్డగింత
ఇల్లెందురూరల్: మండలంలోని సీఎస్పీ బస్తీ గ్రామపంచాయతీ శివారులో ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మాణ స్థల వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ భూమి గతంలో సర్వే నంబర్ 618 పేరుతో రైతులకు జారీచేసిన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో నమోదై ఉంది. అయితే ఇది 549 సర్వే నంబర్ పరిధిలోకి వస్తుందని, అది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు ఏడాది క్రితమే తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు ఫ్లెక్సీఏర్పాటు చేశారు. దీంతో ఒకే భూమిలో వేర్వేరు సర్వే నంబర్లుగా పేర్కొనడం సమస్యగా మారగా రైతులు హై కోర్టును ఆశ్రయించారు. అయితే గత శనివారం అధికారులు ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనం నిర్మాణ పనులు ప్రారంభించగా, రైతులు అడ్డుకున్నారు. తాజాగా మంగళవారం తిరిగి సర్వే చేపట్టడంతో కోర్టు పరిధి లో ఉన్న భూమిలో ఎలా సర్వే చేస్తారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. కాగా, కలెక్టర్ ఆదేశాలతోనే పనులు చేపడుతున్నామని, ఏమైనా అనుమానం ఉంటే కలెక్టర్‌ను కలిసి వివరించాలని అధికారులు సూచించారు. దీంతో రైతులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఎటూతెగని ఇంటిగ్రేటెడ్ గురుకుల
స్థల వివాదం


