యువతి ఆత్మహత్య ఘటనపై రాస్తారోకో
అశ్వాపురం: మండల కేంద్రానికి చెందిన యువతి హైదరాబాద్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై యువతి కుటుంబసభ్యులు, బంధువులు మంగళవారంమణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అశ్వా పురానికి చెందిన కనుకు సరస్వతి(21) హైదరాబాద్‌లో హనుమాన్‌నగర్ సూపర్ స్టూడెంట్ గర్‌ల్స్ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఈనెల 4న సాయంత్రం హాస్టల్ గదిలో ఉరి వేసుకోగా ఈ ఘటనపై మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, యువతి మృతికి అశ్వాపురానికి చెందిన పాలడుగు నందకిషోర్ కారణమంటూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు అతడి ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నాచేశారు. యువతి కుటుంబానికి న్యాయం చేయాలం టూ రహదారిపై మృతురాలి బంధువులు రాస్తారోకో చేపట్టారు. కొంతకాలంగా నందకిషోర్‌తో యువతి ప్రేమలో ఉందని, తమ కుమార్తె మృతికి అతడే కారణమ ని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్, సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


