కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. సోమవారం కొత్తగూడెంలోని 14, 19, 30, 29, 55, 56, 58, 59 డివిజన్లలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మాట్లాడారు. త్వరలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించడంలో కార్యకర్తలు, నాయకులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు , పార్టీ జిల్లా అధ్యక్షురాలు దేవీ ప్రసన్న, మాజీ జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆళ్ల మురళి, రజాక్, మండే వీరహనుమంతురావు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘురాంరెడ్డి


