బ్రిక్స్ ఫ్యాక్టరీ యజమాని అరెస్ట్
పాల్వంచరూరల్: బాలకార్మికుడితో పని చేయిస్తున్న ఇటుకల ఫ్యాక్టరీ యజమానిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధి లక్ష్మీదేవిపల్లిలోని శ్రీవెంకటేశ్వర మణి నిలయం ఇటుకల తయారీ కంపెనీలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంటకు చెందిన బాలుడితో పనులు చేయిస్తున్నారు. దీంతో ఆపరేషన్ స్మైల్ బృందం తనిఖీలో గుర్తించగా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రిక్స్ ఫ్యాక్టరీ యజమాని పగిళ శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.


