15 కిలోల గంజాయి స్వాధీనం
బూర్గంపాడు: సారపాక ప్రధాన కూడలిలో పోలీసులను గమనించి అతివేగంగా పరారవుతున్న బైక్ అదుపు తప్పి కిందపడింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కొద్దిగాయాలతో అక్కడే పడిపోగా వెనుక కూర్చున్న వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు అక్కడకు చేరుకుని సోదాలు చేయగా 15 కిలోల గంజాయి దొరికింది. ఈ ఘటన సోమవారం జరిగింది. ఎస్‌ఐ మేడా ప్రసాద్ కథనం ప్రకారం.. సీలేరు నుంచి జగ్గయ్యపేట వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. బైక్ నడుపుతున్న జగ్గయ్యపేటకు చెందిన కన్నెగంటి ఈశ్వర్ గోపినాఽథ్‌ను పోలీసులు పట్టుకుని విచారించారు. రూ 7.65 లక్షల విలువైన 15కిలోల గంజాయి లభించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పరారైన వ్యక్తి గూటి నాగరాజుగా తేలింది. బైక్‌ను సీజ్ చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని, పరారైన నాగరాజు కోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
పాల్వంచలో 7 కేజీలు..
పాల్వంచరూరల్: ద్విచక్రవాహనంపై తరలిస్తున్న గంజాయిని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ సీహెచ్ శ్రీహరిరావు కథనం ప్రకారం... మండల పరిధిలోని కేశవాపురం గ్రామపంచాయతీలో బీసీఎం జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి పాల్వంచవైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ.4 లక్షల విలువైన 7.4 కేజీల ఎండు గంజాయి లభించింది. పాల్వంచ పట్టణానికి చెందిన గొల్లపల్లి సాంబశివరావు, భూక్యా శ్రీహరి, పొతుల చిన్న ఒడిశా నుంచి గంజాయి తెస్తుండగా పట్టుకున్నారు. ముగ్గురుని అదుపులోకి తీసుకుని, గంజాయితోపాటు ద్విచక్రవాహనం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని పాల్వంచ ఎకై ్సజ్ స్టేషన్‌లో అప్పగించారు.
బైక్ అదుపుతప్పి కిందపడటంతో
పట్టుబడ్డ నిందితుడు
15 కిలోల గంజాయి స్వాధీనం


