జీపు బోల్తా పడి వ్యక్తి మృతి
గుండాల: జీపు బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. కొమరారం ఎస్సై నాగుల్‌మీరా కథనం ప్రకారం.. మండలంలోని చెట్టుపల్లికి చెందిన పెరిక రామకృష్ణ(35) శంభూనిగూడెంలో కిరాయి ఉండటంతో ఆదివారం రాత్రి బయల్దేరాడు. చెట్టుపల్లి–శంభూనిగూడెం మార్గం మధ్యలో ఓ మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. డ్రైవర్ జీపు కింద పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో సోమవారం ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తొమ్మిదోమైలుతండాకు చెందిన గుగులోత్ భద్రు కుమారుడు అశోక్ (26) బైక్‌పై రోళ్లపాడు చెరువు వద్దకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో దర్గా సమీపంలో అదుపు తప్పి మోరీని ఢీకొని కింద పడ్డాడు. దీంతో అశోక్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అశోక్‌కు గత వేసవిలోనే వివాహం కాగా, భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి.
జాతీయ వాలీబాల్ టోర్నీకి ముగ్గురి ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈనెల 11 వరకు జరిగే జాతీయస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. రాష్ట్రజట్టులో స్థానం పొందిన వారిలో కొర్రి జగదీష్, బండ్ల గణేష్, చల్లగుండ్ల సారిక ఉన్నారు. జిల్లా నుంచి క్రీడాకారులు ఎంపిక కావడం పట్ల డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి బి.గోవిందారెడ్డి, కోచ్ నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.
జీపు బోల్తా పడి వ్యక్తి మృతి
జీపు బోల్తా పడి వ్యక్తి మృతి


