ఎస్సీల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి
కొత్తగూడెంఅర్బన్: రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు జరుగుతున్న అన్యాయం, హక్కుల కాలరాత, రిజర్వేషన్లపై శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ కోరారు. సోమవారం కొత్తగూడెం అంబేద్కర్ భవనంలో నిర్వహించిన షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ సమావేశంలో మాట్లాడారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతోపాటు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల సమస్యలను పట్టించుకోకపోతే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఆందోళనలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్, నాయకులు సలిగంటి కొమరయ్య, గోపి కిరణ్, ఇంటికాపల్లి శంకర్, ఆర్ నరసయ్య, ఉండేటి దేవరాజు, మ్యాచెస్, రాజయ్య, కండె రాములు, చిరంజీవి, ఇనుముల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ జీఓను ప్రభుత్వం సవరించాలి
పాల్వంచరూరల్: ప్రభుత్వం ఎస్సీ వర్గీకణను అమలు చేస్తూ విడుదల చేసిన జీఓను సవరించాలని మాల సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి కొమరంభీమ్ భవనంలో సోమవారం జన విజ్ఞాన వేధిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక కన్వీనర్ ఎస్.వెంకటేశ్వర్లు, బరగడి దేవదానం, ఎర్రా కామేష్, న్యాయవాది డి.శోభరాణి, దాసరి శేఖర్, రమణమూర్తి, ఇన్నయ్య, గుర్రం లక్ష్మయ్య, దాసరి రమేష్, శనగ రామచందర్, గడ్డం రాఘవబాబు, ఇస్సాక్, శాంతివర్ధన్, రాజశేఖర్, పోతురాజు బాబు, కమలాకర్, ప్రసాద్ పాల్గొన్నారు.


