పేదల పక్షాన ఎర్రజెండా పోరాటం
అశ్వాపురం/మణుగూరురూరల్/కరకగూడెం/గుండాల: పేదలు, కార్మికులు, కర్షకుల పక్షాన సీపీఐ నిరంతరం పోరాడుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు. సీపీఐ నూరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రచార జాతా ఆదివారం అశ్వాపురం, మణుగూరు, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో సాగింది. మణుగూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. మొండికుంటలో కొల్లు శ్రీనివాసరెడ్డి విగ్రహానికి, మణుగూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించే పార్టీ నూరు వసంతాల ముగింపు సభకు వేలాదిగా తరలిరావాలని కోరారు. సీపీఐ నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, కమటం వెంకటేశ్వరరావు, మువ్వా వెంకటేశ్వరరావు, వేల్పుల మల్లికార్జున్, పేరాల శ్రీను, కొల్లు ఆశ, పగిడిపల్లి జంపన్న, దండి నాగేష్, దంతాల జగదీష్, పవన్‌సాయి, సురేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, వంగరి సతీష్, బుడగం సతీష్, ముత్తయ్య, లక్ష్మీనారాయణ, రాజబాబు, డి.సుధాకర్, వై.రాంగోపాల్, సర్పంచులు ఉషారాణి, కల్పన, రేసు ఎల్లయ్య, క్రిష్ణయ్య, రమేష్, రహీం, హనుమంతు, షాహెద్, శ్రీనివాస్, రామయ్య పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా


