ఇకనైనా మేల్కొంటారా..?
అశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరు బస్టాండ్ నుంచి మొండికుంట గ్రామశివారు అటవీ ప్రాంతంలోని ఎర్రమ్మగుడి వరకు మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారి వెంబడి వాగులపై నిర్మించిన కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. కేఎల్‌ఆర్ కళాశాల బస్సు ప్రమాదం కూడా ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు వద్దే జరిగింది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించగా కల్వర్టు గోడలు కూలుతున్నాయి. కల్వర్టుల వద్ద జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. అయినా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి కల్వర్టు గోడలు నిర్మించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా కల్వర్టులు
ఇకనైనా మేల్కొంటారా..?


