కేంద్రపాలిత ప్రాంతంతో టూరిజం అభివృద్ధి
భద్రాచలం: పోలవరం ప్రాజెక్ట్‌తో ముంపునకు గురయ్యే భద్రాచలం, ఇతర పరిసర ప్రాంతాలను కేంద్రం పాలిత ప్రాంతంగా మార్చాలని, తద్వారా టూరిజం అభివృద్ధి జరుగుతుందని అంతర్జాతయ గాంధీ పథం కన్వీనర్, భద్రాచలం ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షుడు బూసిరెడ్డి శంకర్‌రెడ్డి అన్నారు. భద్రాచలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఊరూరా ఉద్యమంలా సంతకాల సేకరణ జరిపి, సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కాగా, అంతర్జాతీయ స్థాయిలో మహాత్మాగాంధీకి గౌరవం దక్కుతుండగా.. కేంద్రప్రభుత్వం మాత్రం ఆయనను అవమానించేలా ఉపాధి హామీ పథకానికి పేరు తొలగించటం గర్హనీయమని పేర్నొన్నారు. దీనిపై జిల్లాల అఽధికారులకు వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తూ సీఎం రేవంత్‌రెడ్డికి బాసటగా నిలుస్తామని చెప్పారు.
గాంధీ పథం కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి


