ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
టేకులపల్లి: ఉరివేసుకుని ఓ యు వకుడు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం మద్రాస్‌తండా పంచాయతీ కొండంగులబోడు గ్రామానికి చెందిన భూక్య భద్రు – బాజు దంపతులకు నలుగురు సంతానం. వీరిలో మూడో సంతానమైన భూక్య వినోద్ (26) కొత్తగూడెంలోని హోండా షోరూమ్‌లో పని చేస్తున్నాడు. రోజువారి లాగే ఆదివారం తల్లిదండ్రులు పత్తి చేనుకు వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వినోద్ చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పని ముగించుకుని తల్లిదండ్రులు రాత్రి ఇంటికి రాగా.. తలుపు వేసి లోపల గడి పెట్టి ఉంది. ఎంత పిలిచినా పలకకపోవడంతో కిటికీలోంచి చూ డగా.. ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే మృతి చెంది ఉన్నాడు. సమాచారం తెలియగానే ఎస్‌ఐ అలకుంట రాజేందర్ తన సిబ్బందితో సంఘటన స్థలా నికి చేరుకుని పంచనామా నిర్వహించారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉండగా.. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తమ్ముడితో కలిసి భర్తపై దాడి
ఇల్లెందు: తన సొంత తమ్ముడితో కలిసి కట్టుకున్న భర్త మీద దాడి చేసిన సంఘటన పట్టణంలోని కాకతీయనగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా.. కాకతీయనగర్‌కు చెందిన జక్కుల గోపిని అతడి భార్య వీరమ్మ ఆమె సోదరుడు అనబత్తుల ఐలయ్యలు కలిసి భూమి అమ్మాలని ఒత్తిడి చేశారు. ఆయన ససేమిరా అనడంతో వారిద్దరు కలిసి భర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఇది చూసిన చుట్టు పక్కలవారు 108కు సమాచారం అందించి కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందిన అనంతరం గోపి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఐలయ్యపై ఎస్‌ఐ సమ్మిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


