
రాళ్లు రువ్వుతున్న రహదారి
అశ్వారావుపేట: అశ్వారావుపేటలో ఏళ్ల తరబడి జరుగుతున్న సెంట్రల్ లైటింగ్, డివైడర్, రహదారి ఆధునికీకరణ పనులు ప్రజలకు శాపంగా పరిణమించాయి. నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డును తవ్వేసి వెట్‌మిక్స్ పోసి వదిలేశారు. దీంతో దుమ్ము రేగడంతోపాటు లారీల టైర్లకు తగిలి కంకర రాళ్లు ఎగిసి పడుతున్నాయి. రాళ్లు తగిలి దుకాణాల అద్దాలు పగిలిపోతున్నాయి. ఇళ్లలోకి వచ్చి పడుతున్నాయి. ఓ వ్యక్తి బైక్‌పై వెళుతుండగా రాయి వచ్చి ఛాతీపై తగలడంతో గాయపడ్డాడు. అశ్వారావుపేట–ఖమ్మం రహదారిలో నిత్యం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయినా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. రూ.18 కోట్ల పనులను ఏళ్లతరబడి నిర్వహిస్తున్నా ఆ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంలేదు. భారీగా నగదు చేతులు మారిందని, అందుకే చర్యలు తీసుకోవడంలేదనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
పగిలిపోతున్న దుకాణాల అద్దాలు