
ఆదివాసీలు ఉద్యమించాలి
టేకులపల్లి: ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు నిర్వహించిన కొమురం భీమ్ ఆశయ సాధనకు ఆదివాసీలు ఉద్యమించాలని తుడుందెబ్బ జాతీయ కో కన్వీనర్ కల్తి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో ఆదివా రం కొమురం భీమ్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్, జంగిల్, జమీన్ కావాలంటూ నైజాం నవాబులు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరు సల్పారని అన్నారు. భద్రాచలంలో జరిగిన ధర్మ యుద్ధం సభ సక్సెస్ కావడంతో కొందరు లంబాడీ నాయకులు తప్పుడు కేసులు పెడుతున్నారని, ఆదివాసీ ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జోగ ప్రసాద్, మాడే రామకృష్ణ, ఈసాల రవి దొర, మాడే నవీన్, వాసం అనిల్, వాసం శ్రీను, పూణెం దేవరాజు, పూణే వెంకటేశ్వర్లు, మోకాళ్ల రవీందర్, ముడిగా హరీష్, పూణెం నాగరాజ్, ఈసం సత్యం పాల్గొన్నారు.