
విద్యుదాఘాతంతో యువకుడు బలి
కరకగూడెం: విద్యుదాఘాతానికి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వట్టంవారిగుంపు పరిధి అరెంవారిగుంపు గ్రామానికి చెందిన కొమరం మహేశ్ (26) కరకగూడెం పెద్దవాగు పరివాహక ప్రాంతంలో పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి మోటార్‌కి విద్యుత్ తీగలు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా పెద్దవాగులో యువకుడి మృతదేహం కనిపించడంతో కన్నీటి పర్యంతమయ్యారు.

విద్యుదాఘాతంతో యువకుడు బలి