
మళ్లీ పెరిగిన గోదావరి
భద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరిగింది. సోమవారం రాత్రి 10 గంటలకు 46.70 అడుగులకు చేరింది. శనివారం రాత్రి 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఆదివారం రాత్రి 42.70 అడుగులకు చేరడంతో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. కాగా, సోమవారం ఉదయం నుంచి మళ్లీ పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం 46 అడుగులకు పైగా నమోదు కావడంతో భద్రాచలం నుంచి చర్లతో పాటు ఏపీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరీ వాహక ప్రాంత ప్రజలను అధికారలు అప్రమత్తం చేస్తున్నారు. బతుకమ్మల నిమజ్జనానికి గోదావరిలోకి అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, మంగళ వారం మధ్యాహ్నానికి నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశ ం ఉందని అదికారుల అంచనా.
నీట మునిగిన తూరుబాక రోడ్డు
దుమ్ముగూడెం : గోదావరి ప్రవాహం పెరగడంతో మండలంలోని తూరుబాక వద్ద డైవర్షన్ రోడ్డుపైకి వరద చేరింది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో పర్ణశాల, కాశీనగరం, సున్నంబట్టి, దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పర్ణశాల నారచీరల ప్రాంతం పూర్తిగా నీట మునగగా సున్నంబట్టి – బైరాగులపాడు రహదారి పైకి నీరు చేరింది.
కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక