
బతుకమ్మా.. మళ్లీ రావమ్మా..
9లో
జిల్లాలో తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు ఉత్సాహంగా ఆడిన బతుకమ్మ వేడుకలు సోమవారం సద్దుల సంబురంతో ముగిశాయి. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో మహిళలు ప్రదర్శనగా వెళ్లి.. ఉత్సాహంగా ఆడుతూ.. పాడుతూ సందడి చేశారు. బతుకమ్మకు పలు రకాల నైవేద్యాలు సమర్పించి చివరకు చెరువులో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ‘వెళ్లిరా బతుకమ్మా.. మళ్లీ రావమ్మా’ అంటూ గౌరమ్మను వేడుకున్నారు. కాగా, అధికారులు ఆయా గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రాచలం బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ అధికారులు ఏర్పాటుచేసిన కాగితపు బతుకమ్మ విశేషంగా ఆకట్టుకుంది.