
గోదావరి ఘాట్ వద్ద భక్తుడిపై దాడి
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని గోదావరి ఘాట్ వద్ద స్నానం చేస్తున్న ఓ భక్తుడిపై అక్కడే ఓ దుకాణం నడుపుకుంటున్న యువకుడు రాయితో దాడి చేశాడు. స్థానికుల కథనం ప్రకారం.. గురువారం స్వామివారికి దర్శనానికి వచ్చిన మిర్యాలగూడకు చెందిన చెరుకు ఆంజనేయులు గోదావరిలో స్నానం ఆచరిస్తున్నాడు. ఆ సమయంలో ఘాట్ వద్ద దుకాణం నడుపుకుంటున్న సుధాకర్ అనే వ్యక్తి మరో భక్తుడిపై చేయి చేసుకునేందుకు వెళ్తున్నాడు. అడ్డుకోబోయిన ఆంజనేయులును దుర్భాషలాడుతూ రాయితో దాడి చేశాడు. అక్కడే ఉన్న కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. పైగా పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగాడు. కాగా బాధితుడు ఆంజనేయులు స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశాడు.