పాల్వంచరూరల్: మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి అలంకరణ విశిష్టతను అర్చకులు వివరించారు.
రామయ్యను దర్శించుకున్న సీఆర్పీఎఫ్ ఐజీ
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కర్ణాటక రాష్ట్ర సీఆర్పీఎఫ్ ఐజీ విపుల్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఉపాలయాలను సందర్శించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, ఆలయ ఏఈఓ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ సమితిలో ఇద్దరికి చోటు
సూపర్‌జార్(కొత్తగూడెం): చంఢీఘర్‌లో ఐదు రోజులుగా జరుగుతున్న సీపీఐ జాతీయ మహాసభలు గురువారం ముగిశాయి. చివరి రోజున ఎన్నుకున్న కమిటీలో.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్యవర్గ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. కూనంనేని 2005 నుంచి 2009 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2009, 2023లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
సాబీర్‌పాషా విద్యార్థి దశ నుంచే చురుకై న పాత్ర పోషించి, యువజన, కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఏడేళ్ల పాటు ఏఐఎస్‌ఎఫ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, 2001లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2002లో సీపీఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా ఎంపికయ్యారు. భద్రాద్రి జిల్లా ఆవిర్భావం నుంచి జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
ఓయూ నుంచి డాక్టరేట్
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడేనికి చెందిన భూక్యా ప్రకాశ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఎం.వి.కృష్ణారావు పర్యవేక్షణలో ‘జియోపాలిమర్ కాంక్రీట్’ అనే అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఖమ్మంలో బీ.టెక్, హైదరాబాద్‌లో ఎం.టెక్ చదివి ప్రస్తు తం జీహెచ్‌ఎంసీ సర్కిల్–29, టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎన్‌ఏసీ సైట్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ.. తన డాక్టరేట్‌ను తల్లిదండ్రులు కిషన్, చంద్రిలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీ గాయత్రీదేవిగా పెద్దమ్మతల్లి

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ఎస్‌కే సాబీర్‌పాషా