
బీఎస్‌ఎన్‌ఎల్ అదనపు టవర్లతో మెరుగైన సేవలు
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో అవసరమైన చోట్ల బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు ఏర్పాటచేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం సభ్యులు సమావేశమయ్యారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా మెరుగైన సేవలందేలా 189టవర్ల అవసరముందని టీఏసీ కమిటీ, అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యాన ఎంపీ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. ఈ సమావేశంలో టీఏసీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, అమరవాడి సత్యనారాయణరెడ్డి, బానోత్ రంజిత్ నాయక్, మచ్చా రామారావు, పల్లెల రామ లక్ష్మ య్యగౌడ్, కాంగ్రెస్ నాయకుడు కొప్పుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.