
రోడ్డు ప్రమాదంలో యువజన నాయకుడి మృతి
చండ్రుగొండ: మండల కేంద్రానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ సాజిద్ అలియాస్ సజ్జు (28) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సాజిద్‌కు కొన్నేళ్ల క్రితం కొత్తగూడేనికి చెందిన యువతతితో వివాహమైంది. ఏడు నెలల కిందట దంపతులకు కుమారుడు పుట్టాడు. ప్రస్తుతం బాలుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. చూసేందుకు సాజిద్ తన ద్విచక్రవాహనంపై కొత్తగూడెం పయనమయ్యాడు. రుద్రంపూర్ వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన జాజిద్‌ను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని, ఆరాతీశారు. సాజిద్ మరణం బాధాకరమని, ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
బిల్డింగ్ పైనుంచి పడి
వ్యక్తి మృతి
కొత్తగూడెంటౌన్: కేబుల్ కనెక్షన్‌కు చెందిన యాంటీనాను అమర్చుతూ బిల్డింగ్ పైనుంచి జారిపడి బత్తిని సాగర్ (35) మృతి చెందిన ఘటన కొత్తగూడెం పట్టణంలోని రైటర్‌బస్తీ గొల్లగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సూజాతనగర్‌కు చెందిన సరోజిని, వీరయ్య దంపతుల పెద్దకుమారుడు బత్తిని సాగర్ (41) కేబుల్ టీవీ, డిష్ టీవీ కనెక్షన్‌లు ఇస్తుంటాడు. ఓ ఇంట్లో కనెక్షన్ ఇస్తున్న సమయంలో సెకండ్ ఫ్లోర్ నుంచి కాలు జారి కింద పడి, తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సాగర్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య శిరీష, ఐదేళ్ల చిన్నారి లాస్య ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.
బాత్‌రూమ్‌లో జారిపడి
వ్యక్తి మృతి
కొత్తగూడెంటౌన్: బాత్‌రూమ్‌కు వెళ్లి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పంజాబ్‌గడ్డలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పంజాబ్‌గడ్డకు చెందిన భైరిమల్ల మధుసూదన్ (41) పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. స్నానం చేయడానికి బాత్‌రూమ్‌కు వెళ్లి జారి కిందపడ్డాడు. గొంతుకు తీవ్రగాయం కావడంతో ఆయన్ను కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కూమారుడు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువజన నాయకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువజన నాయకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువజన నాయకుడి మృతి