
ఆవు కళ్ల ముందే లేగదూడ మృతి
భద్రాచలంఅర్బన్: తల్లి ప్రేమ మనుషులకే కాదు మూగజీవాలకూ ఉంటుందని నిరూపితమైన ఘట న భద్రాచలంలో మంగళవారం చోటుచేసుకుంది. పట్టణంలోని యూబీ రోడ్డులోని జంక్షన్‌లో నిద్రిస్తున్న లేగదూడ పైనుంచి ప్రమాదవశాత్తు ఓ కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అక్కడే ఉన్న తల్లి ఆవు గమనించి లేగదూడ చుట్టూ తిరుగుతూ లేపేందుకు తీవ్రంగా యత్నించింది. ఆగ్రహంతో స్థానికులెవరినీ అక్కడికి రానివ్వలేదు. ఎంతసేపు అరిచినా లేగదూడ లేవకపోవడంతో అక్కడే నిలబడి దీనంగా చూస్తుఉండిపోయింది. అనంతరం జంతు ప్రేమికుడు ఉదయ్‌కుమార్.. స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, లేగదూడను ఉదయ్‌కుమార్ తన ఫోన్‌తో వీడియో తీస్తుండగానే ఈ ఘటన జరగడం గమనార్హనం. పశువైద్యులు లేగదూడకు పోస్టుమార్టం నిర్వహించగా, గోదావరి సమీపంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
దూడ పైనుంచి కారు వెళ్లడంతో ప్రమాదం