
గుండాలలో కుండపోత వర్షం
గుండాల: గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో సోమవా రం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. సుమా రు రెండు గంటలపాటు వర్షం కురవగా, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అంతర్గత రోడ్లు నీటితో నిండిపోయాయి. కిన్నెరసాని, మల్లన్నవాగు, ఏడు మెలికల వాగు, జల్లేరు, ఈదుల వాగు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆళ్లపల్లి మండలం జిన్నెలగూడెం సమీపంలోని వాగులో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. రాయపాడు గ్రామానికి చెందిన రైతు ఊకే పాపయ్య ట్రాక్టర్‌పై పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. జిన్నెలగూడెం వద్ద వాగు దాటుతున్న సమయంలో వరద పెరగడంతో రైతు వెంటనే పక్కకు దూకడంతో ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ కొంత దూరం కొట్టుకుపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్