
వానొస్తే సెలవే?!
యంత్రాల క్రషింగ్ సామర్థ్యంపై అనుమానాలు
అప్పారావుపేటలో స్టెరిలైజర్ అమరికలో లోపం!
ఫ్యాక్టరీల్లో పేరుకుపోతున్న ఆయిల్‌పామ్ గెలలు
గెలల లోడ్‌తో బారులుదీరుతున్న ట్రాక్టర్లు
దిగుమతికి ఆలస్యం..
ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీల్లో యంత్రాలను ఆధునికీకరించి, పనితీరు మెరుగుపర్చాలి. గెలల ఉధృతికి తగినట్టు ఫ్యాక్టరీల సామర్థ్యం పెంచాలి. క్రషింగ్ సామర్థ్యం సరిగా లేపోవడంతోనే వందల సంఖ్యలో ట్రాక్టర్లతో వేచి ఉంటున్నాం.
– సోడెం వెంకట్, ఆయిల్‌పామ్ రైతు, నల్లకుంట, దమ్మపేట మండలం
ఫ్యాక్టరీలకు తరచుగా సెలవులు ప్రకటించకుండా శాశ్వత పరిష్కారం చూపాలి. యంత్రాలు నిర్దేశించిన సామర్థ్యం మేరకు పనిచేస్తున్నాయా లేదా అనే విషయం పరిశీలించారు. లోపాలు ఉంటే సరిచేసి చేయాలి. అందుకు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. – చెక్కిరాల మల్లేశ్వరరావు,
ఆయిల్‌పామ్ రైతు, దమ్మపేట
ఇదీ ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీల తీరు
పక్వానికి వచ్చినా వర్షాల సమయంలో తోటలో గెలలు కోయడం వీలుకాదు. దీంతో రైతులు వర్షం తగ్గగానే రైతులందరూ గెలలు కోసి తరలిస్తున్నారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం గంటకు 30 టన్నులు కాగా, గెలల నిల్వలు 1500 టన్నులు దాటగానే ఫ్యాక్టరీకి సెలవు ప్రకటించి గెలలను దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీకి తరలించాలని రైతులకు సూచిస్తున్నారు. దీంతో అక్కడా రెండు రోజుల వ్యవధిలోనే మూడు వేల టన్నుల వరకు గెలలు వచ్చి చేరుతున్నాయి. అప్పారావుపేటలో యంత్రాలు పూర్తిస్థాయిలో క్రషింగ్ చేయడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వర్షం తగ్గగానే ఒకేసారి గెలలను కోసి తరలించడం, యంత్రాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో ఫ్యాకర్టీల వద్ద ట్రాక్టర్లు వందల సంఖ్యలో బారులుదీరుతున్నాయి. దీంతో రెండు, మూడు రోజులపాటు సెలవు ప్రకటించి, నిల్వ ఉన్న గెలలను క్రషింగ్‌చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
సమస్యకు పరిష్కారం
చూపకుండా సెలవులా..?
అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం గతేడాది గంటకు 90 టన్నులకు పెంచారు. అయినా ఫ్యాక్టరీలో రెండు, మూడు వేల టన్నుల గెలల నిల్వలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఫ్యాక్టరీలకు వచ్చిన గెలలను ఏ రోజుకు ఆ రోజు క్రషింగ్ చేయడంలేదని రైతులు పేర్కొంటున్నారు. దీంతో ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యులు రెండు, మూడు రోజులపాటు సెలవులు ప్రకటించి, నిల్వ ఉన్న గెలలను క్రషింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల వర్షం వచ్చి తగ్గాక ఫ్యాక్టరీలకు గెలలు పోటెత్తాయి. దీంతో ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజులు, 19 నుంచి 21 వరకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు. సమస్యకు పరిష్కారం చూపకుండా సెలవులు ప్రకటించడంపై పామాయిల్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్టెరిలైజర్ అమరికలో తేడా వల్లే..
అప్పారావుపేట ఫ్యాక్టరీలో క్రషింగ్ సామర్థ్యం 90 టన్నులకు పెంచగా, రూ. 50 కోట్లతో బాయిలర్, స్టెరిలైజర్ యంత్రాలను అమర్చారు. కానీ ఫ్యాక్టరీలో క్రషింగ్ గంటకు 90 టన్నులు జరగడంలేదనే రైతులు ఆరోపిస్తున్నారు. క్షితిజ సమాంతరంగా ఏర్పాటు చేయాల్సిన స్టెరిలైజర్‌ను లంబదిశలో అమర్చడంతో క్రషింగ్ సామర్థ్యం తగ్గిందనే ఆరోపణలు వస్తున్నాయి. 90 డిగ్రీల వ్యత్యాసంలో స్టెరిలైజర్‌ను అమర్చడం వల్ల క్రషింగ్ సామర్థ్యం తగ్గడంతోపాటు క్రూడ్ ఆయిల్ దిగుబడి శాతం కూడా తగ్గుతోందని రైతులు పేర్కొంటున్నారు. రోజుకు 1800 నుంచి 2000 టన్నుల వరకు వేల క్రషింగ్ జరగాల్సి ఉండగా, యంత్రాల అమరికలో తేడా వల్ల 1500 నుంచి 1600 టన్నుల వరకు మాత్రమే అతి కష్టంగా క్రషింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక అశ్వారావుపేట ఫ్యాక్టరీలో గురువారం అనధికారికంగా క్రషింగనిలిపివేసినట్లు తెలిసింది. ఫ్యాక్టరీ సామర్థ్యం ప్రస్తుతం గంటలకు 30 టన్నులుకాగా, కనీసం 45 టన్నులకు పెంచాలని రైతులు కోరుతున్నారు.
వర్షం తగ్గగానే ఫ్యాక్టరీలకు గెలలు అధికంగా వస్తున్నాయి. అయినా రైతులకు, డ్రైవర్లకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. వీరి కోసం క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశాం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అశ్వారావుపేట ఫ్యాక్టరీకి వెళ్లాల్సిన గెలలను కూడా అప్పారావుపేటకు తరలిస్తున్నాం. దీంతో అప్పారావుపేట ఫ్యాక్టరీకి గెలల ఉధృతి పెరుగుతోంది. సామర్థ్యానికి మించి, సుమారు మూడు వేల టన్నుల వరకు గెలలు వచ్చిన కారణంగా, ఫ్యాక్టరీలకు సెలవులు ప్రకటించి నిల్వ ఉన్న గెలలను క్రషింగ్ చేస్తున్నాం.
– కల్యాణ్, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్
ఒకటి, రెండు రోజులు వర్షం వస్తే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలకు రెండు, మూడు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నారు. ఇలా ఈ నెలలోనే రెండుసార్లు సెలవులు ఇచ్చారు. ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీల్లో సామర్థ్యం మేరకు గెలల క్రషింగ్ చేయడంలేదని, అందుకే సెలవు ప్రకటించి క్రషింగ్ పూర్తి చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. యంత్రాలను సరైన రీతిలో అమర్చకపోవడంవల్లే ఇలా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఫ్యాక్టరీల్లో గెలలు గుట్టలుగా పేరుకుపోయి, వందల సంఖ్యలో ట్రాక్టర్లు బారులుదీరుతుండటంతో రైతులు అవస్థ పడుతున్నారు. –దమ్మపేట
ఫ్యాక్టరీలకు ట్రాక్టర్లు వందల సంఖ్యలో రావడంతో గెలల దిగుమతికి ఐదు గంటల వరకు సమయం పడుతోంది. యాజమాన్యాలు సెలవు ప్రకటించగానే, ఆ ముందు రోజే రైతులు గెలలను కోసి రాత్రి సమయం వరకు ఫ్యాక్టరీకి పంపుతున్నారు. దీంతో దిగుమతికి పది గంటల సమయం కూడా పడుతోంది. దీంతో వాహనాల డ్రైవర్లు, రైతులు గంటలపాటు వేచి ఉండాల్సివస్తోంది.

వానొస్తే సెలవే?!

వానొస్తే సెలవే?!

వానొస్తే సెలవే?!

వానొస్తే సెలవే?!