
‘సీతారామ’కు గడ్డిపూల సోయగం
సీతారామ ప్రాజెక్ట్ కాలువ ఒడ్డున గడ్డిపూలు కనువిందు చేస్తున్నాయి. ప్రధాన కాలువ, సమీప రహదారికి ఇరువైపులా, సమీపంలోని మట్టిగుట్టలపై విరగబూసి ఆహ్లాదం పంచుతున్నాయి. గుబురుగా పెరిగిన గడ్డి, నిలువెత్తు తెల్లటిపూలు, వినీలాకాశం వెరసి ప్రకృతి గీసిన చిత్రంలా ఆకట్టుకుంటున్న ఈ దృశ్యాలు ములకలపల్లి మండలం పూసుగూడెం, మాధారం మధ్య అటవీ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. నీటి ఆవాసాలు, వాటి సమీపంలో పెరిగే ఈ పుష్పాలను కొన్ని ప్రాంతాల్లో రెల్లు పూలని పిలుస్తుంటారు. ఏటా ఇదే సమయంలో ఇవి పూస్తాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. – ములకలపల్లి

‘సీతారామ’కు గడ్డిపూల సోయగం