
మాదకద్రవ్యాలను నిర్మూలించాలి
మణుగూరురూరల్: మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ పసుపులేటి, మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్‌రెడ్డి సూచించారు. మండలంలోని ముత్యాలమ్మనగర్ జీపీ పరిధిలోని మణుగూరు శాఖా గ్రంథాలయంలో శనివారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించగా.. వారు పాల్గొని మాట్లాడారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు అలవాటు పడొద్దని, దీంతో జీవితాలు చీకటిమయం కావడంతో పాటు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని తెలిపారు. క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటి సాధనకు కృషి చేయాలని చెప్పారు. సదస్సులో గ్రంథాలయ నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.