
ఏజెన్సీలో హైఅలర్ట్..
చర్ల: ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెప్టెంబర్ 21న మావోయిస్టు 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీలో హైఎలర్ట్ ప్రకటించారు. అటవీ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలను తరలించి, కూంబింగ్ ముమ్మరం చేశారు. అటవీ ప్రాంత గ్రామాలకు వెళ్లే రహదార్లలో ప్రత్యేకంగా బలగాలను మోహరించి, తనిఖీలను నిర్వహిస్తున్నారు. మండలంలోని కుర్నపల్లి, పెదమిడిసిలేరు, ఉంజుపల్లి మార్గాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్న సీఆర్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు ప్రతీ ఒక్కరినీ నిశితంగా పరిశీలిస్తున్నాయి. కొంతకాలం పాటు స్తబ్ధుగా ఉన్న మావోయిస్టులు మళ్లీ లేఖలు జారీ చేయడం, వాల్‌పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేయడంతో పోలీసు శాఖ మరింత అప్రమత్తమైంది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులతో పాటు అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ రెండు రోజుల క్రితం లేఖ విడుదల చేసిన నేపథ్యంలో పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. ఎస్పీ, భద్రాచలం ఏఎస్‌పీల ఆదేశాల మేరకు చర్ల సీఐ రాజువర్మ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
నేటి నుంచి మావోయిస్టు పార్టీ
21వ ఆవిర్భావ వేడుకలు