
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
ఎస్పీ రోహిత్‌రాజు
ఇల్లెందు: సైబర్ నేరాలకు గురై మోసపోకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. శుక్రవారం ఆయన ఇల్లెందు డీఎస్పీ కార్యాలయలో తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. క్రైం రికార్డులు, కేసుల నమోదు, పోలీస్ శాఖ పని తీరుపై సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారులు, స్థోమత కలిగిన వ్యక్తులను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. డీఎస్పీ చంద్రభాను, సీఐలు టి. సురేష్, బి.సత్యనారాయణ, రవీందర్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.