
యువకుడి అదృశ్యం
పాల్వంచరూరల్: పది రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన యువకుడు కనిపించకుండాపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దంతలబోరు గ్రామ పంచాయతీ గంగదేవిగుప్ప గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న కుంజా రామకృష్ణ (28) ఈ నెల 10వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదని, తన ఫోన్ కూడా స్వీచ్ఛాఫ్ వస్తోందని రామకృష్ణ సోదరి వెంకటరమణ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.సురేశ్ వెల్లడించారు.
గుర్తుతెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
ఖమ్మంక్రైం: ఖమ్మం పాత బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి (45) మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. ఈ నెల 18వ తేదీన జిల్లా ఆస్పత్రిలో కడుపు నొప్పికి చికిత్స చేయించుకున్నట్లు ఆయన వద్ద ఓపీ స్లిప్ లభించగా, దానిపై భద్రుగా పేరు ఉందని తెలిపారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 59107, 87125 51370, 87126 59106 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
జిల్లాస్థాయి పోటీలకు
టేకులపల్లి వాసులు
టేకులపల్లి: మండలానికి చెందిన విద్యార్థులు జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. సులానగర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఉపేందర్, చరణ్, సూర్య, మనోజ్, లోకేశ్, లోకేశ్‌కుమార్, ఐశ్వర్య, సిరివెన్నెల, రామ్, ఉపేందర్, గ్రీష్మగాయత్రి, పావని, ప్రణీత, శిరీష, వాసవి, లావణ్య, మాధవి, లాస్య, పల్లవి, శ్రీజ, కుసుమ, ఉదయ్‌భాస్కర్, చరణ్, దీపక్ అక్టోబర్‌లో జరిగే జిల్లాస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం గుర్రం దేవదాస్, ఫిజికల్ డైరెక్టర్ మంజీలాల్ తెలిపారు. బొమ్మనపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థిని బుర్రి జెశ్విత కూడా ఎంపికై నట్లు పీఈటీ సీత వెల్లడించారు.