
ఏపీ డీఎస్సీలో టేకులపల్లివాసికి ఉద్యోగం
టేకులపల్లి: ఇటీవల ప్రకటించిన ఏపీ డీఎస్సీ ఫలితాలో టేకులపల్లి మండల ఆదివాసీ బిడ్డకు వ్యాయామ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం లభించింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని ఎర్రాయిగూడెం పంచాయతీకి చెందిన ఊకే రాజేందర్‌రావు – లక్ష్మి దంపతుల కుమార్తె ఊకే శిరోమణి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ రావడంతో పరీక్ష రాసింది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో నాన్ లోకల్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) ఉద్యోగానికి ఎంపికై ంది. మారుమూల గ్రామంలోని ఆదివాసీకి ఏపీ డీఎస్సీలో పీఈటీగా ఉద్యోగం రావడంపై గ్రామస్తులు అభినందించారు.