
చదువుతో పాటు కళల్లోనూ రాణించాలి
కొత్తగూడెంఅర్బన్ : విద్యార్థులు చదువుతో పాటు కళల్లోనూ రాణించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో రెండు రోజుల పాటు జరగనున్న జిల్లా స్థాయి కళోత్సవం పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నప్పుడు తనకు కూడా కళల పట్ల ఆసక్తి ఉండేదని, కానీ వాటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయానని తెలిపారు. నేటి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటేనే భవిష్యత్ బాగుంటుందని సూచించారు. పిల్లలంతా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవడానికి దారి చూపించేది ఇలాంటి పోటీలేనని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి మాట్లాడుతూ పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని తీపి జ్ఞాపకాలను తమతో తీసుకెళ్లాలని సూచించారు. ఈ పోటీలలో సుమారు 200 మంది విద్యార్థులు 12 రకాల కళారూపాలను రెండు రోజులపాటు ప్రదర్శించనున్నారని తెలిపారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగ రాజశేఖర్ మాట్లాడుతూ.. మొదటి రోజు శాసీ్త్రయ, జానపద నృత్యాలు, థియేటర్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ 2డీ, 3డీ అంశాల్లో, రెండో రోజు గాత్ర సంగీతం, వాయిద్య సంగీ తం, కథలు చెప్పడం వంటి పోటీలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు సతీష్ కుమార్, సైదులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్