
తుది పోరులో రుధిర ధారలు
న్యూస్‌రీల్
విప్లవబాట వీడబోమంటూ గెరిల్లాలుగా మారిన కమ్యూనిస్టులు
ఈ పోరులో గెరిల్లాలకు అడ్డాగా మారిన జిల్లా
చివరి దశలో భీకరపోరు..
గెరిల్లాల ప్రధాన స్థావరంగా..
బుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం బ్రిటిష్ వారి సహకారంతో పాలన సాగిస్తున్న నిజాం రాజు చేతిలోనే ఉంది. అతడి సైన్యమైన రజాకార్లు తెలంగాణ వ్యాప్తంగా బీభత్సం సృష్టించారు. గ్రామాల్లో దమనకాండ సాగించారు. వారిని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పోరు సాగించారు. ఆయుధ శిక్షణ తీసుకుని నిజాం సైన్యాన్ని మట్టి కరిపించారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో కమ్యూనిస్టులు సైతం ప్రాణాలొదిలారు. ఇరు వర్గాల మధ్య భీకర పోరుతో నాడు పల్లెల్లో రక్తం ఏరులై పారింది. చివరకు 1948 సెప్టెంబర్ 17న నిజాం సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని వీడడంతో ఈ ప్రాంతం కూడా భారత్‌లో భాగమైంది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
పోలీస్ చర్యతో హైదరాబాద్ స్టేట్ భారత్‌లో విలీనమైనందున సాయుధ రైతాంగ పోరాటం ఆపేయాలని కమ్యూనిస్టులకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అప్పటివరకు కమ్యూనిస్టులకు మద్దతుగా నిలిచిన వర్గాలు సైతం ప్రభుత్వ ప్రతిపాదనపై మొగ్గు చూపాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పది లక్షల ఎకరాల భూమిని పేద రైతులకు పంపిణీ చేసి కమ్యూనిస్టులు బలంగా ఉన్నారు. పల్లెల్లో సంఘం ఎంతో కీలకంగా మారింది. రైతాంగ పోరాటం ఆపితే గ్రామాలను వదిలి పట్టణాలకు పారిపోయిన భూస్వాములు తిరిగి వస్తారని, అప్పటి వరకు చేసిన పోరాటం వృథా అవుతుందనే వాదనలు కామ్రేడ్ల నుంచి వినిపించాయి. అప్పటికి రాజ్యాంగం అందుబాటులోకి రాకపోవడంతో పోరాటం ద్వారా తాము పంపిణీ చేసిన భూమిని పేదలకు చట్టబద్ధంగా ఎలా పంచాలనే అంశంపై కమ్యూనిస్టులకు స్పష్టత లేదు. దీంతో సాయుధ పోరాటం కొనసాగించడమే మంచిదని నాటి నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
ఆర్మీపై ఆరోపణలు
సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు నాయకులు చేసిన ఆరోపణల ప్రకారం 1950 సెప్టెంబర్ 6న ఆళ్లపల్లి, ఇల్లెందు నుంచి ప్రత్యేక బలగాలు గుండాలకు వెళ్లి విప్లవకారులకు మద్దతుగా ఉన్న గ్రామాలపై విచక్షణారహితంగా దాడులు చేశాయి. గుండాల సమీపంలోని ముత్తాపురం – దొంగతోపు మధ్య ఆ రోజుల్లో పోలీస్ క్యాంప్ ఉండేది. దీన్ని కేంద్రంగా చేసుకుని సాయుధ పోరాటానికి మద్దతుగా ఉన్న గిరిజనులపై ఆర్మీ దమనకాండకు పాల్పడిందని చెబుతారు. ఆ తర్వాత ఆళ్లపల్లి ఆర్మీ క్యాంపు ద్వారా జరిగిన వివిధ ఆపరేషన్లలో మొత్తం 119 మంది రైతాంగ పోరాట వీరులు మరణించారు. అందులో ఒక్కరోజే 45 మంది చనిపోయారు. ఇక్కడ గెరిల్లా నుంచి ప్రతిఘటన ఎక్కువగా ఉండటంతో వైమానిక దాడులు జరిగినట్టుగా చెబుతారు. బెండాలపాడు గుట్టల్లో దాగి ఉన్న గెరిల్లాల ఆచూకీ కోసం అక్కడి ఆదివాసీ కుటుంబాలపై దాడులు జరిగాయి. గార్ల జాగీరులోని కట్టుగూడెంలోనూ అమానవీయ దాడులు చోటుచేసుకున్నాయి.
పోరాట విరమణ..
ఇరువైపులా అంతులేని హింస చెలరేగడంతో చివరకు 1951 అక్టోబర్ 21న సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్టు కమ్యూనిస్టులు ప్రకటించారు. దీంతో క్రమంగా శాంతి నెలకొనడం మొదలైంది. పోరాటం విరమించే సమయానికి జిల్లా పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో 50 మంది విప్లవకారులు, 500 మంది కోయ మిలిటెంట్లు మిగిలారు.
3
సాయుధ పోరాటం ఆపాలన్న భారత సర్కారు
సుశిక్షుతులైన, ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన భారత సైన్యం ముందు అల్పస్థాయిలో ఆయుధాలు, అంతంతగానే సైనిక శిక్షణ కలిగిన విప్లవకారులతో రైతాంగ పోరాటం చేయడం కమ్యూనిస్టులకు కష్టంగా మారింది. దీంతో గెరిల్లా పోరాటమే మార్గమని నాయకత్వం భావించింది. కరీంనగర్ జిల్లా గెరిల్లాలు మంథని అడవుల్లోకి వెళ్లగా.. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన గెరిల్లాలు అటు నల్లమల ఇటు పాల్వంచ, ఇల్లెందు అడవుల్లో తలదాచుకున్నాయి. దీంతో 1949 ఫిబ్రవరి నాటికి సాయుధ రైతాంగ పోరాటానికి భద్రాద్రి జిల్లానే ప్రధాన స్థావరంగా మారింది. రెండు వందల గ్రామాల్లో విప్లవ సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సాయుధ దళాలను వెదుక్కుంటూ భారత ఆర్మీ ఇక్కడి అడవులపై దృష్టి పెట్టింది. జిల్లా వ్యాప్తంగా మైసూర్ సైన్యం, గూర్ఖా పోలీసులతో కూడిన 30కి పైగా ఆర్మీ క్యాంపులు వెలిశాయి. ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలోనే పల్లెల్లో రక్తం ఏరులై పారింది.

తుది పోరులో రుధిర ధారలు

తుది పోరులో రుధిర ధారలు

తుది పోరులో రుధిర ధారలు