
రామాలయంలో ఉట్ల వేడుక
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఉట్ల పండుగను మంగళవారం ఆనందోత్సాహాలతో నిర్వహించారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి వేడుకలు ముగిసిన మరుసటి రోజున ఈ పండుగ జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పల్లకీలో స్వామి వారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి మేళతాళాల నడుమ చిత్రకూట మండపం వద్దకు తీసుకెళ్లారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన యాదవులు ఉట్లు కొట్టడంలో పోటీ పడ్డారు. అనంతరం స్వామి వారికి తిరువీధి సేవ నిర్వహించారు.
రామయ్య సన్నిధిలో ప్రముఖులు
శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా గురునందానంద సరస్వతీ పీఠం నిర్వాహకులు మాధవానంద సరస్వతీ స్వామి, ఎస్పీ రోహిత్‌రాజ్ దంపతులు వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి వేద పండితులు, ఈఓ దామోదర్ రావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు.
స్వామివారిని
దర్శించుకున్న పలువురు