
తిరుమల సంకీర్తనలో దుమ్ముగూడెం వాసులు
దుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం గ్రామానికి చెందిన టీటీడీ హిందూ ధర్మ ప్రచారక్ పిలక నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణానికి చెందిన స్వర రాగ సుధ భజన మండలి కళాకారులు తిరుపతిలో జరిగిన అఖండ హరి నామ సంకీర్తనలో పాల్గొన్నారు. ఈ సంకీర్తనలో భాగంగా శ్రీరామ రక్ష స్తోత్రం హనుమాన్ చాలీసా 11 పర్యాయాలు, గోవిందనామాలు అన్నమయ్య సంకీర్తనలు, భజన పాటలు ఆలపించారు. కార్యక్రమంలో స్వర రాగ సుధ భజన మండలి అధ్యక్షులు జవ్వాజి వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొల్లు సునీత, సభ్యులు బేబీ, రామలక్ష్మి, అరుణ, సుశీల, నాగమణి, పద్మ, పద్మావతి పాల్గొన్నారు.