
ఏరియా వ్యాప్తంగా ‘స్వచ్ఛతాహీసేవా’
కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లలో స్వచ్ఛతాహీసేవా కార్యక్రమం నిర్వహించాలని నోడల్ ఆఫీసర్, జీఎం (హెచ్‌ఆర్‌డీ) టి.వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సింగరేణి ప్రధాన కార్యాలయలో కార్పొరేట్ ఏరియా సభ్యులతో ఆయన కార్యక్రమ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆఫీస్, గనులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 25వ తేదీన ‘ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్’ కార్యక్రమంలో భాగంగా సామూహిక శ్రమదానం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జీఎం(పర్సనల్) వెల్ఫేర్ – సీఎస్‌ఆర్ జీవీ కిరణ్‌కుమార్, ఆర్.కిరణ్‌రాజ్‌కుమార్, డి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.